![]() |
![]() |
.webp)
సినిమా షూటింగ్ లకి పెద్ద పెద్ద సెలెబ్రిటీలు అత్యవసరమైతే విమానాల్లో వెళ్తుంటారు . అయితే కొంతమంది యాక్టర్స్ ఓ ఈవెంట్ కోసం బళ్లారికి ఫ్లైట్ లో వెళ్తున్నారు. ఆ కొందరిలో యాంకర్ సుమ కనకాల ఒకరు.
మలయాళీ అమ్మాయి అయినా తెలుగులో సీరియల్స్ తో ఎంట్రీ ఇచ్చి యాంకర్ గా దాదాపు 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులని మెప్పించి తెలుగు వారింట్లో ఒక భాగమైంది సుమ కనకాల. తెలుగు వారింటి ఆడపడుచులా పేరు తెచ్చుకుంది. ఓ పక్క యాంకర్ గా షోలు, మరో పక్క సినిమా ఈవెంట్స్, అప్పుడప్పుడు నటిగా సినిమాలు, యూట్యూబ్ లో వీడియోలు.. ఇలా ఫుల్ బిజీగా ఉంది సుమ. ఏ స్టేజ్ మీద అయినా తన మాటలతో మెస్మరైజ్ చేస్తూ అనర్గళంగా మాట్లాడుతుంది సుమ. స్పాంటేనియస్ కామెడీ పంచ్ లతో ఎప్పుడు ఆకట్టుకునే సుమ.. సోషల్ మీడియాలో కూడా తన ప్రతిభని కనబరుస్తుంది. తన యూట్యూబ్ ఛానెల్ లోను వీడియోలు చేస్తూ బిజీగా ఉంటుంది సుమ. తన యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో కొన్ని టిప్స్ ఇస్తూ వీడియోలు కూడా చేస్తుంది.
సుమ తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో 'బళ్లారిలో మా అల్లరి' అనే వ్లాగ్ ని అప్లోడ్ చేసింది. అందులో మార్నింగ్ వేకప్ నుండి ఈవినింగ్ ప్యాకప్ వరకు తీసిన కొన్ని వీడియోలని క్లబ్ చేసి వీడియోగా చేసింది. ఇందులో సింగర్ సునీత, సద్దాంలని చూపించిన సుమ.. సద్దాంతో కలిసి కాసేపు కబుర్లు చెప్పుకొచ్చింది. ఈ ఫ్లైట్ సేఫ్ గా బళ్లారి వెళ్తుందంటావా అని సద్దాంని అడుగగా. ఏమో మేడమ్ తెలియదని అతనన్నాడు. పాపి చిరాయువు అని సుమ కవర్ చేసింది. ఇక తను ఈవెంట్ కోసం పడేపాట్లు అన్నీ కలిపి ఈ వ్లాగ్ లో వివరించింది సుమ. కాగా ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
![]() |
![]() |